Sita Ramam : 'సీతారామం' మూవీ సీక్వెల్ పై దుల్కర్ సల్మాన్ ఆసక్తికరమైన కామెంట్స్..

Sita Ramam : సీతారామం చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ ఉంటుందా అని నటుడు దుల్కర్ సల్మాన్‌ను సినీ రిపోర్టర్స్ ప్రశ్నించారు. దానికి దుల్కర్ సమాధానం చెప్తూ.. 'సీతారామం కథ, డైరెక్షన్ చూసి మేము ముందే ఈ సీతారామం క్లాసిక్‌గా నిలుస్తుందని ఊహించాం. క్లాసిక్‌గా పెద్ద హిట్ అయిన సినిమాలను ఇంక టచ్ చేయవద్దని నిర్ణయించుకున్నాం. కాబట్టి సీతారామం మూవీకి సీక్వెల్ ఉండదు' అని అన్నారు.
హను రాఘవపూడి సీతారామం చిత్రాన్ని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రామ్, సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించారు. అఫ్రీన్ పాత్రలో రష్మిక, కమెడియన్లుగా వెన్నల కిషోర్, తరుణ్ భాస్కర్ అలరించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com