Dulquer Salamaan : ఆ స్క్రీన్‌షాట్స్ సేవ్ చేసి పెట్టుకున్న : దుల్కర్ సల్మాన్

Dulquer Salamaan : మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజాగా చేసిన కామెంట్ ఇప్పుడు సినీ టౌన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయనను వ్యక్తిగతంతా టార్గెట్ చేసి విమర్శించిన వారి కామెంట్స్, పోస్ట్స్ స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్నారట. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నుంచి స్పూర్తి పొంది ఇలా చేసినట్లు చెప్పారు. అభిషేక్ బచ్చన్‌ను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆర్టికల్ రాస్తే.. ఆ ఆర్టికల్‌ను కత్తిరించి అద్దం పై అతికించేవారట. రోజు దాన్ని చూసుకునే వారని దుల్కన్ సల్మాన్ చెప్పుకొచ్చారు.
తనపై పర్సనల్‌గా అటాక్ చేస్తూ వచ్చిన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులన్నిటినీ స్క్రీన్ షాట్ తీసి ఫోన్ గ్యాలరీ సేవ చేసుకున్నారట. అప్పుడప్పుడు వాటిని చూస్తానని అన్నారు. వ్యక్తిగతంతో టార్టెట్ చేసిన వారి ఐడీలు కూడా బాగా గుర్తున్నాయన్నారు. ఇటీవళ సీతారామ చిత్రం ఘనవిజయం సాధించింది. సెప్టెంబర్ 23న 'చుప్ : రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' అనే బాలీవుడ్ మూవీతో మనముందుకు వస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com