టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఆరు గంటలకు పైగా విచారించిన ఈడీ..!

టాలీవుడ్  డ్రగ్స్ కేసు..  ఆరు గంటలకు పైగా విచారించిన ఈడీ..!
X
డ్రగ్స్‌ వ్యవహారంలో సినీనటి ముమైత్ ఖాన్‌ ను ఆరు గంటలకుపైగా ఈడీ అధికారులు విచారించారు.

డ్రగ్స్‌ వ్యవహారంలో సినీనటి ముమైత్ ఖాన్‌ ను ఆరు గంటలకుపైగా ఈడీ అధికారులు విచారించారు. ముమైత్ ఖాన్ నుంచి కెల్విన్ కు పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ముమైత్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలు, విదేశీ డ్రగ్స్ పెడలర్ తో జరిపిన ట్రాన్సక్షన్ పై ఆరా తీసినట్లు తెలుస్తోంది. 2015 నుంచి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ తో విచారణకు రావాలని ఇదివరకే ముమైత్‌ఖాన్‌కు ఈడీ ఆదేశాలిచ్చింది. విచారణలో భాగంగా మరోసారి ఆదేశిస్తే...విచారణకు హాజరుకావాలని ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు స్పష్టం చేశారు...VIS

ఈడీ విచారణ అనంతరం సినీనటి ముమైత్‌ఖాన్ ముంబైకి తిరిగి ప్రయాణం అయ్యారు. విదేశీ డ్రగ్స్ పెడలర్ కెల్విన్‌తో సినీ ప్రముఖులకు గల సంబంధాలు, లావాదేవీలపై ఈడీ ముమ్మరంగా విచారణ చేపడుతోంది. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌, నందు, రానా, రవితేజ, రానా, నవదీప్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ముమైత్‌ఖాన్‌ను విచారించారు. ఇదే కేసులో ఈనెల 17న హీరో తనీష్, ఈనెల 22న మరో నటుడు తరుణ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

Tags

Next Story