Entertainment: మరో పెళ్లి ముచ్చట....

Entertainment: మరో పెళ్లి ముచ్చట....
శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా అథితి, సిద్ధార్ధ్....

టాలీవుడ్ లో త్వరలోనే మరో జంట పెళ్లితో ఏకమవ్వబోతోందట. ఇప్పటికే శర్వానంద్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ కు టాటా చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలోనే మరో జంట కలసి దర్శనమివ్వడంతో మరోసారి తెలుగు నాట పెళ్లి భాజాభజంత్రీలు మోగుతాయని తెలుస్తోంది.


శర్వానంద్ నిశ్చితార్థ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. వీరిలో అథితీ రావ్ హైదరీ, సిద్ధార్ధ్ కూడా ఉన్నారు. అయితే వీరు విడివిడిగా కాక జంటగా కార్యక్రమానికి విచ్చేయడంతో అందరి చూపూ వారిమీదే పడింది.


ఇప్పటికే అథితి, సిద్ధార్ధ్ చెట్టాపట్టాల్ వేసేస్తున్నారు. కలసి డిన్నర్లకు, సినిమాలకూ షికార్లు కొట్టేస్తున్నారు. మీడియాకు కలసి ఫోజులు ఇచ్చేందుకు అస్సలు వెనుకాడటంలేదు. దీంతో వీరిద్దరి మధ్యా పెనవేసుకున్న అనుబంధం అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక శర్వానంద్ ఇంటకి జంటగా విచ్చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేశారనే చెప్పాలి. మరి ఇదే ఊపులో త్వరలో వీరిద్దరూ కూడా పెళ్లి ముచ్చట చెప్పేస్తారేమో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story