Entertainment: ఆహా "నేను సూపర్ ఉమెన్"

ఎంటర్‌టైన్‌మెంట్ కు అడ్డాగా మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ "ఆహా" తాజాగా మరో బిజినెస్ రియాలిటీ షోతో మనముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకోసం "నేను సూపర్ ఉమెన్" అనే రియాలిటీ షోను ఆహా టీం ప్లాన్ చేసింది. మహిళా వ్యాపారవేత్తలకు వారి ఆలోచనలు పంచుకునేందుకు, అలాగే వారి జీవిత ప్రయాణం గురించి చెప్పుకునేందుకు సరైన వేదికను ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాలిటీ షో కొత్త రికార్డులు సృష్టించేలా ఉండబోతోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహ౦ అందిచండం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందనడంలో సందేహమేమి లేదు. కానీ సామాజిక-ఆర్థిక కారణాల వల్ల మహిళలు తరచూ వెనకబడిపోతున్నారు. ఆహా 'నేను సూపర్ ఉమెన్' అనే కార్యక్రమం ప్రత్యేకంగా మహిళా వ్యాపారవేత్తల కోసం తీసుకువచ్చింది. మెరుగైన వ్యాపార ఆలోచనలు ఉన్న మహిళలు, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలను 'ఏంజెల్స్'గా ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టనున్నారు. వారు పోటీదారులకు సలహాలు, సూచనలను అందించి ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో ఏంజల్స్‌గా ముద్ర వెంచర్స్ వ్యవస్థాపకురాలు స్వాతిరెడ్డి గునుపాటి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్, సిల్వర్ నీడిల్ వెంచర్స్ పార్ట్‌నర్ రేణుక బొడబొట్ల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com