Entertainment: ముద్దల మావయ్యతో తేజ్ సయ్యాట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ప్రాజెక్ట్ లన్నీ త్వరితగతిన పూర్తిచేసేందు ఉవ్విళ్లూరుతున్నాడు. 2024 ఎన్నకల దృష్ట్యా ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలోనే వినోదయ సితమ్ రీమేక్ పనులు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. సముత్తిరఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. 2021లో తమిళంలో విడుదలైన వినోదయ సితమ్ సముత్తిరఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న ఈ చిత్రాన్నే తెలుగులో పవన్, తేజ్ తో రీమేక్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. షూటింగ్ తో పాటూ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లు పనుల సైతం సమానంగా సాగిపోయేలా చిత్ర బృందం పక్కాగా ప్లాన్ చేస్తోంది. తద్వారా ఈఏడాది ఆగస్ట్ లోని 15 నుంచి 20 తారీఖుల్లోగా సినిమా రిలీజ్ ను కూడా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా ఖరారు అయిందని తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ కోసం పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో ఆడి పాడేందుకు శ్రీలీలను ఎంపిక చేశారట. ఇక 20 రోజల కాల్షీట్ కోసం పవర్ స్టార్ అత్యంత భారీగా రూ.60కోట్ల వసూలు చేస్తున్నాడట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com