Entertainment: ఈ జంటతో మరో సినిమా తీయండయ్యా!

Entertainment: ఈ జంటతో మరో సినిమా తీయండయ్యా!
సిద్ధార్ధ్, అదితి రావ్ హైదరీ చేసిన రీల్స్ కు ఫిదా అవుతోన్న నెటిజెన్లు; పెళ్లి ముచ్చట చెబుతారని ఆశిస్తున్న ఫ్యాన్స్...

ఏ క్షణాన అజయ్ భూపతి మదిలో బొమ్మరిల్లు సిద్ధార్ధ్, అదితి రావ్ హైదరీ జంటగా మెదిలారో గానీ, ఆ పుణ్యమాని ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మహా సముద్రం సినిమాలో జంటగా నటించిన దగ్గర నుంచి వీరి మధ్య అనుబంధం బలపడిందనే చెప్పాలి. ఇక ఆ నాటి నుంచి చట్టాపట్టాలేస్తూ తరచూ మీడియా కంట పడుతూనే ఉంది ఈ అందాల జంట. అయితే తమ బంధం గురించి ఇప్పటి వరకూ అధికారికంగా ఇరువురిలో ఎవరూ స్పందించలేదు. కానీ, ప్రతీ ఈవెంటకూ జంటగానే హాజరవుతోన్న సిద్ధు- అదితి చెప్పకనే తాము పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నామని చెబుతూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో జంటగా ఓ రీల్ చేసి అటు ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే, ఇటు ఇండస్ట్రీ జనాలకు మరో హింట్ కూడా ఇస్తున్నారు. ఈ రీల్ ను పోస్ట్ చేస్తూ డాన్స్ మంకీస్, ది రీల్ డీల్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ రీల్ కాస్తా వైరల్ గా మారింది. దియా మిర్జా, హన్సిక వంటి టాప్ స్టార్ హార్ట్ ఎమోజీలతో వీరిపై ప్రేమను కురిపించేశారు. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవని చెప్పాలి. కామెంట్ల రూపంల ో ఈ జంటపై ఎనలేని అభిమానాన్ని కురిపించేస్తున్నారు. ఇక కొందరైతే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేయండి అంటూ రిక్వెస్ట్ లు కూడా పంపిస్తున్నారు. మరి వారి విన్నపాన్ని సిద్ధూ - అదితి కాస్త సీరియస్ గా తీసుకుంటారేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story