Entertainment: 'గాంగేయ' మూవీ ప్రారంభం

Entertainment:  గాంగేయ మూవీ ప్రారంభం
చంద్రశ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాంగేయ; హీరో హీరోయిన్లుగా గగన్ విహారి, అవ్యుక్త...

సంపూర్ణ కుటుంబం కథా చిత్రాలు ఏవి అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంల ో దర్శకుడు రామచంద్ర శ్రీనివాస్ అచ్చమైన తెలుగింటి కథను మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో గాంగేయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజే పూజా కార్యక్రమం నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సముద్ర క్లాప్ కొట్టగా.. సమర్పకులు ఎం విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడిలా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాను తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపాడు. దేశ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా.. కుల మత బేధాలు లేకుండా మనిషి మనిషిని ప్రేమిస్తేనే శాంతి చేకూరుతుందనే పాయింట్ మీద సినిమా రాబోతోందని వివరించారు. జాతీయ స్థాయిలో ఐదు భాషల్లో సినిమాను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక హీరో గగన్ విహారి మాట్లాడుతూ 'ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి' అంటూ ప్రేక్షకులకు విన్నవించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story