Entertainment: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ సిరీస్

Entertainment: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ సిరీస్
సీరియళ్లలో ట్రెండ్ సెట్ చేసేందుకు వస్తోన్న మందాకిని; మొదటి 8 ఎపిసోడ్లు ఫ్రీ అంటోన్న ఆహా....

సీరియళ్లు అంటే అత్తాకోడళ్ల పోరు, భార్యాభర్తల హోరు అన్న చందాన్న తయారైన నేపథ్యంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఆహా సిద్ధమైంది. మందాకిని అనే ఫ్యాంటసీ సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవ్వగా విపరీతమైన ఆదరణ చూరగొంది. అంతే కాదు తదుపరి ఎపిసోడ్ల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే ఆర్య ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. ఓ అమ్మాయి గురించి కలలు కనే ఆర్యకు ఎట్టకేలకు అతడి కలల సుందరి మందాకిని తారసపడుతుంది. అయితే తన ఊరికి లభించిన శాపం వల్ల మందాకిని పీడించబడుతుంటుంది. ఈ శాపానికి విమోచనం లభించాలంటే ఆర్య, మందాకినితో కలసి ఆ ఊరి ఆలయంలో ఓ పూజ నిర్వహించాలి. కానీ, అందుకు అనేక అవాంతరాలు ఏర్పడుతుంటాయి. కళింగవర్మ వారి ప్రయత్నాలకు అడ్డుపడుతుంటాడు. ఈ క్రమంలో ఆర్య ఆ శాపం వెనుక ఉన్న కారణాన్ని అణ్వేషిస్తాడు. మరి ఆర్య ఆ శాపానికి విమోచనం కనుగొంటాడా, మందాకినిని దక్కించుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ లో మొదటి 8 ఎపిసోడ్లు పూర్తి ఉచితంగా ఆశ్వాదించవచ్చు. మరి... ఈ సిరీస్ కూడా హిట్ అయ్యి ఆహా ఖాతాలో మరో విజయం పడుతుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story