Entertainment: RRRకు మరో 4 అంతర్జాతీయ అవార్డులు

Entertainment: RRRకు మరో 4 అంతర్జాతీయ అవార్డులు
హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డులు; నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నRRR; బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం,బెస్ట్‌ యాక్షన్‌,ఒరిజినల్‌ సాంగ్‌,బెస్ట్‌ స్టంట్స్‌, కేటగిరీల్లో అవార్డులు ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి ఇండియన్‌ సినిమాగా రికార్డు; నాటు నాటు పాటకు తగ్గని క్రేజ్‌

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డుల పంట కురిపిస్తుంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ లాంటి పలుఇంటర్నేషనల్‌ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది.

Tags

Read MoreRead Less
Next Story