Nachindi Girl Friendu : 'ఎర్రతోలు పిల్ల' లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన సుకుమార్..

Nachindi Girl Friendu : ఎర్రతోలు పిల్ల లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన సుకుమార్..
Nachindi Girl Friendu : యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ

Nachindi Girl Friendu : యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.


శుక్రవారం ఈ చిత్రం నుంచి 'ఎర్రతోలు పిల్లా..' అనే లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ విడుదల చేశారు. పాట క్యాచీగా బాగుందన్న ఆయన చిత్రబృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించగా ధనుంజయ్ పాడారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Tags

Read MoreRead Less
Next Story