టాలీవుడ్

ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వరులు..!

గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవ‌రు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవ‌రు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది.

ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వరులు..!
X

గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవ‌రు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవ‌రు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది.

బిగ్గెస్ట్ మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వరుడు అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేస్తూ.. హోస్ట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను షాడో రూపంలో చూపించారు. తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 1 తర్వాత ఎన్టీఆర్ .. చేస్తున్న రియాలిటీ షో ఇదే కావడం విశేషం.. కాగా ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప‌లు ప్రోమోస్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

దీనిని త్రివిక్రమ్ షూట్ చేసినట్టుగా సమాచరం.. ఒక్కో ఎపిసోడ్ కి గాను ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మార్చ్ చివరి వారంలో షో మొదలుకానునందని తెలుస్తోంది.


Next Story

RELATED STORIES