టాలీవుడ్

అలా మొదలైంది 'రామ్‌'తో పరిచయం: సునీత

అప్పటి నుంచే మేము స్నేహితులు అయ్యాము. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.

అలా మొదలైంది రామ్‌తో పరిచయం: సునీత
X

శనివారం జరిగిన సాంప్రదాయ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనితో మూడు ముళ్లు వేయించుకున్న సింగర్ సునీత ఉపద్రష్ట తన వివాహ కలను నిజం చేసుకుంది. ఈ వివాహం హైదరాబాద్ శివార్లలోని అమ్మపల్లెలోని శ్రీ సీతా రామ స్వామి ఆలయంలో జరిగింది. సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకను "దైవ నిర్ణయం" గా అభివర్ణించిన సునీత, తన భర్త రామ్‌తో కలిసి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు .

జాతీయ మీడియాతో మాట్లాడుతూ సునీత, "కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తక్కువ రద్దీ ఉండే ఒక ఆలయంలో ఈ వేడుకకు ప్రణాళిక వేసుకున్నాము. అయినప్పటికీ, మాకు రెండు వైపులా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. దాంతో అతిథుల జాబితా 200 మందికి చేరుకుంది.

చాలా సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ సంస్థను నడుపుతున్న రామ్‌తో పరిచయం ఉందని ఆమె తెలిపారు. "రామ్ నా సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించేవాడు, అందువల్ల ఒకరినొకరు తెలుసుకునే అవకాశం వచ్చింది. అప్పటి నుంచే మేము స్నేహితులు అయ్యాము. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం.

మా కుటుంబాలతో చర్చించిన తరువాత, మా సంబంధాన్ని వివాహ బంధంతో ముడిపెట్టాలని నిర్ణయించుకున్నాము అని సునీత తెలిపారు. పిల్లలు ఆకాష్, శ్రేయ అమ్మ సునీత తీసుకున్న నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించారు. "జీవిత భాగస్వామిని, సహచరుడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోవాలని కొన్నేళ్లుగా అడుగుతున్నారు, కాని నా పిల్లలు చిన్నవారు వాళ్లు సురక్షితంగా ఉండాలని కోరుకున్నాను అని సునీత చెప్పింది," అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యారు. నేను నా వివాహ విషయమై వారితో చర్చించినప్పుడు, వారు నన్ను కౌగిలించుకున్నారు, అలాంటి కుటుంబం ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతురాలినని చెప్పారు."

హనీమూన్ ప్రణాళికలపై తాను, రామ్ ఇంకా ప్లాన్ చేయలేదని సునీత చెప్పారు. "మేము రిసెప్షన్ ఏర్పాటు చేయలేదు. కలవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి రాబోయే కొద్ది వారాల్లో స్నేహితుల కోసం చాలా చిన్న పార్టీలు అరేంజ్ చేయాలనుకుంటున్నాము. మే తరువాత ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేస్తామని సునీత అన్నారు.

Next Story

RELATED STORIES