'కార్తీక‌దీపం' ఫేం హిమ ఇంటికి మాజీ మంత్రి ఈటెల..!

కార్తీక‌దీపం ఫేం హిమ ఇంటికి మాజీ మంత్రి ఈటెల..!
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది.

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. సీరియల్ మాత్రమే కాదు.. అందులోని నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. చైల్డ్‌ ఆర్టిస్టులు సహృద(హిమ), కృతిక(శౌర్య) నుంచి నిరుపమ్(డాక్టర్‌ బాబు) అందరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో సహృద(హిమ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకి సంబంధించిన ఫోటోలను, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తమ ఇంటికి వచ్చారని చెబుతూ.. ఆయనతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది సహృద. అయితే ఆయన ఎందుకు వచ్చారన్న విషయాన్నీ మాత్రం వెల్లడించలేదు. దీనితో అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story