F3 Movie: 5వ రోజు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఎఫ్ 3... రూ.35 కోట్ల షేర్‌తో బ్లాక్ బస్టర్..

F3 Movie: కొన్ని సార్లు తెరమీద జరిగే మ్యాజిక్ లాజిక్ లకు అందదు. అక్కడ విశ్లేషణలకు చోటు ఉండదు..కేవలం ఆ నవ్వుల మ్యాజిక్ ని ఎక్స్ పీరియన్స్ చేయడం అంతే గా.. అంతేగా అనుకుంటూ పొట్ట చేత్తో నవ్వుతూ బయటకు రావడం .. ఇదే ఇప్పడు ఎఫ్ త్రి థియేటర్స్ దగ్గర కనిపిస్తున్న దృశ్యం.. తెలుగు సినిమా నవ్వుల పూర్వ వైభవం తీసుకువచ్చి నవ్వించే వారికి ఎప్పుడూ నీరాజనాలే అని నిరూపించింది ఎఫ్ 3.
తెలుగు సినిమా ప్యాండమిక్ విసిరిన పంజాదెబ్బనుండి కోలుకోకముందే టికెట్స్ రేట్స్ ప్రేక్షకుల్లో కొంత అంసతృప్తి ని కలిగించాయి.. అసలు ప్యాన్ ఇండియా లుక్ ఉన్న సినిమాలు తప్ప మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే తీసిన సినిమాలకు ఆదరణ ఉంటుందా..? ఇవన్నీ ప్రశ్నలు అయితే ఎఫ్ 3 ఒకటే సమాధానంగా నిలబడింది. తెలుగు సినిమా కి కొత్త ఊపిరినిచ్చింది.
అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు అవవు.. అలా ప్రయత్నించడం కూడా నేల విడిచి సామే అవుతుంది. అందుకే బడా సినిమాలు ఇచ్చిన ధైర్యం కంటే ఎఫ్ త్రి విజయం ఇచ్చిన ధైర్యం ఎక్కువ. థియేటర్స్ ని నవ్వులతో , బాక్సాఫీస్ లను రికార్డ్ లతో నింపుతున్న ఎఫ్ త్రి ఈ సమ్మర్ కే స్పెషల్.. వెంకటేష్ అన్ లిమిటెడ్ ఎనర్జీకి .. వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ కి ఎఫ్ 3 ని ఫ్యామిలీస్ తమ సినిమాగా చేసుకున్నాయి.
వాళ్ళకి ధియేటర్స్ కి కాసేపు నవ్వుకోవడానికి వస్తున్నారు.. నవ్వులకు గ్యాప్ ని ఇంటర్వేల్ లోనే ఇచ్చాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇక అంతేగా.. అంతేగా బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ లైన్ ఎఫ్ త్రి కి యాడ్ అయ్యింది. అనీల్ రావిపూడి కి నిజమైన స్టార్ డమ్ ఈ సినిమాతో మొదలైంది.ఎందుకంటే ఈ సినిమా కి అతను తెరవెనుక మాత్రమే కాదు.. ప్రమోషన్స్ లో చేసిన సందండి.. అతని టైమింగ్ కి టాప్ రేటింగ్ ఇచ్చారు ప్రేక్షకులు..
వాళ్ళు చెప్పిందే చేసారు.. మీ నవ్వులకు మాది గ్యారెంటీ అనే మాటమీద నిలబడ్డారు.. సినిమాను టాప్ ప్లేస్ లో ప్రేక్షకులు నిలబెట్టారు. చాలా రోజులు తర్వాత ఆలీ బాగా నవ్వించాడు. సునీల్ నువ్వు నాకు నచ్చవ్ టైమింగ్ తో అలరించాడు. వెన్నెల కిషోర్ మార్క్ కామెడీతో కితకితలు పెట్టాడు. తమన్నా, మెహ్రిన్ ఎఫ్ 2 ప్లోని అలా కంటిన్యూ చేసారు. కేవలం నవ్విద్దాం అనుకొని హార్ట్ తో పనిచేసాడు దర్శకుడు.
అందుకే ఆలోచించకుండా నవ్వగలుగుతున్నారు ప్రేక్షకులు.. ఎఫ్ టు కంటే ఎఫ్ త్రి మరింత ప్యామిలీస్ కి పిల్లలకు దగ్గర చేసాడు దర్శకుడు చివరి 20 నిముషాలు స్టార్ హీరోల ను తెరమీదకు తెచ్చి దర్శకుడు అనీల్ చేసిన ప్రయోగం నవ్వుల బాంబ్ లా పేలింది.. నవ్వులతో ఊగిపోతున్న థియేటర్స్ తో వీక్ డేస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతుంది ఎఫ్ త్రి.
ఐదో రోజు మూడు కోట్ల పదిహేడు లక్షల షేర్ ని సాధించింది. మొత్తం కలెక్షన్స్ ముప్పై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల షేర్స్ ని ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్యాండమిక్ లో నెలకొన్న స్తబ్దత, టికెట్స్ రేట్స్ విషయంలో అసంతృప్తి, ప్యామిలీ సినిమాలకు థియేటర్స్ కి రావడం లేదనే అనుమానాలు ఇన్ని ప్రస్టేషన్స్ మద్య ఫన్ రైడ్ తో దూసుకుపోతూ ఎఫ్ 3 బ్లాక్ బస్టర్ అంటే ఇట్టా ఉండాలా అని ప్రూవ్ చేసింది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com