Allu Arjun : అల్లు అర్జున్‌కి హిట్... ఆ హీరోయిన్‌లు ఫట్..!
మెగా కాంపౌండ్ లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కష్టపడి స్టార్‌గా ఎదిగాడు అల్లు అర్జున్.. తాత లెజెండ్, మామ స్టార్ హీరో, నాన్న బడా ప్రొడ్యూసర్.. కానీ కష్టమే బన్నీని ఐకాన్ స్టార్‌గా నిలబెట్టింది. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఆ తర్వాత కొంచం గ్యాప్ తీసుకొని ఆర్య సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన బన్నీ, దేశముదురు, జులాయి సినిమాలు అల్లు అర్జున్‌ని స్టార్‌గా నిలబెట్టాయి. ఇదిలావుండగా అల్లు అర్జున్‌ని ఇప్పుడో సెంటిమెంట్ వెంటాడుతుందట.. అదేంటంటే బన్నీతో డెబ్యూ మూవీ చేసే ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోతుంది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ సరసన ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ అవ్వడంతో అమ్మడుకి బాగానే ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు కానీ.. ఈ సినిమా తర్వాత అడపాదడపా ఓ రెండు మూడు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా పూర్తిగా ఫెడ్ అవుట్ అయిపొయింది. ఇక బన్నీ రెండో సినిమా ఆర్యతో మరో హీరోయిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అనురాధ మెహతా.. ఈ సినిమా బన్నీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెస్తే... హీరోయిన్ అనురాధ మెహతా మాత్రం ఇంకో రెండు మూడు సినిమాలు చేసేసి ఇండస్ట్రీకి త్వరగానే గుమ్మడికాయ కొట్టేసింది.
ఇక అల్లు అర్జున్ మూడో సినిమాగా వచ్చిన బన్నీ సినిమాకి మళ్ళీ కొత్త అమ్మాయినే తీసుకున్నారు. ఆమె గౌరీ ముంజాల్.. ఈ సినిమా తప్ప గౌరీ ముంజాల్ సినిమాలేంటంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఇక వరుడు సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటే అంతమంచింది. సినిమా డిజాస్టర్ లోనే హీరోయిన్ పేరు ఆమె ఫేం రెండు కొట్టుకుపోయాయి. ఆమె భానుశ్రీ మెహరా.. అటు పూరీ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక కాస్త సక్సెస్ అయిందని చెప్పాలి. కానీ ఈ భామకి ఇప్పుడు అంతగా అవకాశాలు లేవు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హీరోయిన్‌లు త్వరగానే ఫెడ్ అవుట్ అయ్యారు కానీ.. ఆ సినిమాలు మాత్రం బన్నీని స్టార్ చేయడానికి పునాదులు వేశాయి.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న 'ఐకాన్' సినిమాలో ఇద్దరు హీరోయిన్ లకి స్కోప్ ఉండడంతో ఓ హీరోయిన్‌గా పూజ హేగ్దే ని ఫిక్స్ చేయగా, మరో హీరోయిన్ కోసం కొత్త అమ్మాయిని ట్రై చేస్తున్నారట మేకర్స్. స్క్రిప్ట్ ఓ కొలొక్కి రావడంతో ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. మరి ఆ భామ ఇండస్ట్రీల ఎన్నాళ్ళు నిలుస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com