పవన్ కళ్యాణ్ 'ఫిదా'.. శేఖర్ కమ్ముల 'కథ'

పవన్ కళ్యాణ్ ఫిదా.. శేఖర్ కమ్ముల కథ
ఆయన చిత్రాలు ఓ మంచి కాఫీ లాంటి కథలు. కుటుంబం అంతా కలిసి చూసే కథాంశాలు. హీరో హీరోయిన్ల మద్య సున్నితమైన ప్రేమ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.

ఒకరిని ఊహిస్తూ కథని రాసుకొని, మరో ఇద్దరు హీరోల దగ్గరకు వెళితే వాళ్లిద్దరూ రిజెక్ట్ చేయగా ఇంకో హీరోని పెట్టి సినిమా తీసి తన ఖాతాలో మరో సక్సెస్‌ని వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన చిత్రాలు ఓ మంచి కాఫీ లాంటి కథలు. కుటుంబం అంతా కలిసి చూసే కథాంశాలు.

హీరో హీరోయిన్ల మద్య సున్నితమైన ప్రేమ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. తన చిత్రాలన్నింటిలో హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చినా హీరో ఇమేజ్‌ని ఏమాత్రం తగ్గించకుండా ఉంటాయి. అయినా స్టార్ హీరోలు ఆయన చిత్రాల్లో నటించాలంటే ఓ అడుగు వెనక్కు వేస్తారు.అందుకు నిదర్శనమే 'ఫిదా' చిత్రం. ఫిదా వచ్చి నాలుగేళ్లయినా ఎప్పుడు టీవీలో వచ్చినా ఎంతో ఆసక్తిగా మళ్లీ చూడాలనిపిస్తుంది. అదో అందమైన ప్రేమకావ్యం. అందుకే అందర్నీ ఫిదా చేసింది. అయితే ఈ కథను రాసుకునేటప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్‌ని ఊహించుకున్నారట.

ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిర్మాత దిల్ రాజుకు కథను చెప్పినప్పుడు కూడా పవన్ అయితే బాగుంటుందని చెప్పారట. కథను రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ తనను నడిపించారని శేఖర్ కమ్ముల అన్నారు.

ఖుషి సినిమా ఛాయలు ఫిదా సెకండాఫ్‌లో కనిపిస్తాయని, అందుకే పవన్‌తో సినిమా తీద్దాం అనుకున్నానని శేఖర్ తెలిపారు. అయితే ఆయనకు కథను వినిపించలేకపోయారట. ఇక ఇదే కథను పట్టుకుని మహేశ్ బాబు దగ్గరకు వెళితే ఆయన సున్నితంగా తిరస్కరించాడట.మరో హీరో రామ్‌చరణ్ దగ్గరకు వెళితే హీరో పాత్రను డామినేట్ చేసేలా హీరోయిన్ పాత్ర ఉండేసరికి తన ఇమేజ్‌కి డ్యామేజ్ అవుతుందని ఆయన కూడా ఫిదాని రిజెక్ట్ చేసారట. సబ్జెక్ట్ నచ్చినా చేయలేకపోతున్నా అంటూ మరో మెగా హీరో వరుణ్ తేజను తీసుకోమని సజెస్ట్ చేశారట.

దాంతో ఆయన వరుణ్ తేజ్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. చిత్రంలో సాయిపల్లవి, వరుణ్ నటన అద్భుతంగా ఉంటుంది. అందుకే ఒకరితో అనుకుని మరొకరితో పూర్తి చేసినా సక్సెస్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల.ఇప్పుడు లవ్ స్టోరీ అంటూ నాగచైతన్య, సాయిపల్లవితో సినిమా తీస్తున్నారు. ఇందులోని సారంగ దరియా పాట ఎంత పెద్ద హిట్టయిందో మనందరికీ తెలిసిందే. ఇక చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారని శేఖర్ కమ్ముల భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story