Tollywood: ముగిసిన సినీ కార్మికుల సమ్మె.. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్‌లు..

Tollywood: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె ముగిసింది.. ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.. వేతనాల పెంపునకు నిర్మాతలు సిద్ధమవడంతో రేపట్నుంచి యధావిధిగా షూటింగ్‌లు జరగనున్నాయి.. కార్మికులంతా షూటింగ్‌లకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. షూటింగ్‌లకు హాజరయ్యే కార్మికులకు పెంచిన జీతాలు చెల్లిస్తామని నిర్మాతలు చెప్తున్నారు.. పెంచిన జీతాలు రేపటి నుంచే అమలు చేస్తామని చెప్పారు..
అటు వేతనాల పెంపు విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు.. దిల్ రాజు చైర్మన్‌గా ఏర్పాటైన కోఆర్డినేషన్ కమిటీ వేతనాలపై రేపు చర్చించనుంది.. మంత్రి తలసాని చొరవతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని సి.కళ్యాణ్ చెప్పారు.. సమావేశంలో అన్ని విషయాలపై చర్చించామని చెప్పారు.. వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమయ్యారని.. అన్ని సమస్యలను కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com