గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రాజమౌళి హీరోయిన్..!
సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది హీరోయిన్స్ ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంతగా మాత్రం స్టార్‌డం మాత్రం రాదు. దీనితో పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అవుతుంటారు. అలా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్‌లలో నటి గజాలా ఒకరు. స్టార్ హీరోలతో నటించి ఉన్నట్టుండి సడన్‌గా మాయమైపోయింది గజాలా.
2001లో జగపతిబాబు హీరోగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది గజాలా.. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తర్వాత ఈ భామకి అవకాశాలు అయితే వచ్చాయి కానీ ఆ సినిమాలు మరో మెట్టుని ఎక్కించలేకపోయాయి. ఒకానొక సమయంలో సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో చూస్తుండగానే గజాలా ఇండస్ట్రీకి దూరమైంది.
అటు ఇండస్ట్రీలో ఓ యువ హీరోతో ప్రేమలో పడి అది చెడడంతో ఆత్మహాత్యయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి, టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను 2016లో వివాహం చేసుకొని కువైట్ లో స్థిరపడ్డపడింది. సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com