Gangavva With Chiru : చిరుతో గంగవ్వ.. రోల్ ఏంటో తెలుసా?

Gangavva With Chiru: యూట్యూబ్ లో మై విలేజ్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది గంగవ్వ.. తెలుగు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు గంగవ్వకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో కనిపించి మెప్పించిన గంగవ్వకి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్‌ని తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు చిరంజీవి.. ఇందులో గంగవ్వ చిరంజీవికి తల్లిగా నటిస్తోంది. ఈ విషయాన్ని గంగవ్వే వెల్లడించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గంగవ్వ ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com