టాలీవుడ్

యాంకర్ 'గంగవ్వ'.. నాగార్జునని ఏమడిగిందో తెలుసా!!

గంగవ్వ ఇంటర్వ్యూలో భాగంగా చిత్రానికి సంబంధించిన విషయాలతో పాటు నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అడిగి ప్రేక్షకుల డౌట్స్ ని క్లియర్ చేశారు.

యాంకర్ గంగవ్వ.. నాగార్జునని ఏమడిగిందో తెలుసా!!
X

నీ కంటే నేనే రెండేళ్లు పెద్ద గంగవ్వా అంటూనే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమెకు అత్యంత గౌరవం ఇచ్చారు నటుడు నాగార్జున. హౌస్‌లోని కంటెస్టెంట్లందరూ ఆమె వయసుకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నన్ని రోజులు బాగా చూసుకున్నారు. పల్లెటూరిలో పుట్టి పెరిగిన గంగవ్వ పచ్చని పొలాలను, ప్రేమాప్యాయతలు పంచే ఊరుని విడిచి ఉండలేకపోయింది.

ఏసీ గదుల్లో ఉక్కపోసింది. తాను తినే పచ్చడి మెతుకులే తనకు ఆరోగ్యం అంటూ బిగ్‌బాస్ ఎంత బాగా చూసుకుంటున్నా తానక్కడ ఇమడలేకపోతున్నానంటూ హౌస్‌లోకి వెళ్లిన కొద్ది రోజులకే ఇంటి ముఖం పట్టింది. మౌ విలేజ్ షో ద్వారా పాపులరైన గంగవ్వను సినిమా ప్రమోషన్లలో భాగస్వామిని చేశారు.

ఏ కొత్త సినిమా రిలీజైనా గంగవ్వకు ఆ సినిమాకు సంబంధించిన నటీనటులను ఇంటర్వ్యూ చేసే బాధ్యతను అప్పగించారు. అందులో భాగంగానే తాజాగా వైల్డ్‌డాగ్ చిత్రంలో నటించిన నాగార్జునను ఇంటర్వ్యూ చేసింది గంగవ్వ. ఏప్రిల్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నటుడు నాగ్ ప్రమోషన్స్‌లో పాల్గొటున్నారు.

గంగవ్వ ఇంటర్వ్యూలో భాగంగా చిత్రానికి సంబంధించిన విషయాలతో పాటు నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అడిగి ప్రేక్షకుల డౌట్స్ ని క్లియర్ చేశారు. ఇందులో భాగంగా నాగచైతన్య, సమంత మీకు మనవడని ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగితే అందుకు నాగ్.. నేను కూడా అడుగుతున్నాను అన్నారు.

ఇక అఖిల్ పెళ్లెప్పుడు చేసుకుంటాడు అంటే.. ఆ విషయం తనకే వదిలేశానని చెప్పుకొచ్చారు నాగార్జున. మొత్తానికి గంగవ్వ చేసిన ఇంటర్వ్యూ అభిమానులను ఆకట్టుకుంది.

కాగా, వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్‌గా నటిస్తున్నారు. ఇక ఈచిత్రం ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ మహేష్, చిరంజీవి మెచ్చుకున్నట్లు నాగార్జున తెలిపారు.

Next Story

RELATED STORIES