Gargi Trailer: తండ్రి కోసం కూతురి న్యాయపోరాటం.. 'గార్గి' ట్రైలర్ రిలీజ్..

Gargi Trailer: రీసెంట్ సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి ఇప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించలేదు. కానీ తాను ఏ సినిమాలో నటించినా.. తన డామినేషనే ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి మొదటిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అదే 'గార్గి'. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది.
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్‌తో గడిపేసే టీచర్ గార్గి. అలాంటి తన హ్యాపీ లైఫ్‌లో తన తండ్రి అరెస్ట్‌తో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని గార్గి ఎలా ఫైట్ చేసింది అనేదే కథ. గార్గి ట్రైలర్ చూస్తుంటే సాయి పల్లవి మరోసారి తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేస్తుందని అర్థమవుతోంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ భాషల్లో జులై 15న విడుదల కానుంది.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన గార్గి ట్రైలర్ భావోద్వేగాలతో నిండిపోయింది. కాలి వెంకట్, శరవణన్ కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించినట్టుగా కనిపిస్తోంది. గార్గి చిత్రాన్ని తమిళంలో సూర్య సమర్పిస్తుండగా.. తెలుగులో రానా ఈ బాధ్యతను తీసుకున్నాడు. సాయి పల్లవి చివరిగా నటించిన 'విరాటపర్వం' చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా.. సాయి పల్లవి యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. కానీ గార్గి మాత్రం కమర్షియల్‌గా కూడా సక్సెస్ అవ్వాలని సాయి పల్లవి అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com