మళ్లీ హారికా హాసిని తో జత కలిసిన గీతా ఆర్ట్స్

మళ్లీ హారికా హాసిని తో జత కలిసిన గీతా ఆర్ట్స్
మరోసారి సెట్ అయిన అలవైకుంఠపురం కాంబో...

హారికా హాసిని గీతా ఆర్ట్స్ సంయుక్తం గా నిర్మించిన అల వైకుంఠ పురం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ స్క్రీన్ మ్యాజిక్ ఈ సినిమా ను మోస్ట్ మెమొరబుల్ మూవీ గా మార్చింది. ఈ కాంబినేషన్ లో అదే నిర్మాణ సంస్థ ల తో సినిమా అనౌన్స్ అంటే అది ఇండస్ట్రీ లోనూ ప్రేక్షకుల లోనూ మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది . త్రివిక్రమ్ అల్లు అర్జున్ హారికా హాసినిలో ఇది నాలుగో సినిమా అవడం ఇది మరింత ఆసక్తి గా మారింది. హారికా హాసిని బ్యానర్ ని తన హోమ్ బ్యానర్ అని అల్లు అర్జున్ పలు సందర్బాలలో చెప్పడం జరిగింది. ఆ మాటను బన్నీ నిలబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ సందీప్ రెడ్డి వంగ తో T series కి ఒక సినిమా కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నారు.

Tags

Next Story