Geeta Basra Emotional : వరుసగా రెండుసార్లు అబార్షన్.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా..!

Geeta Basra Emotional : టీంఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ భార్య, సినీ నటి గీతా బస్రా తాజాగా రెండోసారి పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆమెకు రెండుసార్లు గర్భస్రావానికి గురైంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
"ప్రతి మహిళ తాను ప్రెగ్నెంట్ అని తెలిసిస రోజునుంచి బిడ్డను ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామని ఎదురు చూస్తుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అలా మిస్ అయితే జీవితాన్ని మిస్ అయ్యాననే ఫీలింగ్ వస్తుంది. ఇలాగే నాకూడా అనిపించింది. మొదటిసారి పాప హీర్ ప్లాహా పుట్టాక రెండు సార్లనాకు గర్భస్రావం అయ్యింది.. ఆ సమయంలో నేను చాలా డిప్రెషన్‌కు లోనయ్యాను. కానీ నా భర్త నాకు అండగా నిలబడ్డారు. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుందని కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు.. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం అనేది ఓ పీడకలలా మారుతుంది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ దైర్యాన్ని కోల్పోవద్దు.. ఆశను కోల్పోవద్దు.. అందుకే నా అనుభవాలను ఇలా పంచుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
కాగా 'ద ట్రైన్' సినిమాతో మంచి కగ్గుర్తింపు తెచ్చుకున్న గీతా బస్రా.. 2015లో టీంఇండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వీరి ప్రేమకి గుర్తుగా 2016 లో పాప పుట్టింది ఆమెకి హీర్ ప్లాహా అనే పేరుగా పెట్టగా ఈ ఏడాది జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే బాబు పుట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com