Sudheer Rashmi: సుధీర్, రష్మి పెళ్లి చేసుకుంటారా..? గెటప్ శ్రీను ఏం చెప్పాడంటే..?

Sudheer Rashmi: ఎంతోకాలంగా స్టాండప్ కామెడీ షోగా అలరిస్తూ.. ఇప్పటికీ ఫేడవుట్ అవ్వకుండా నిలబడగలిగింది జబర్దస్త్. కానీ గతకొంతకాలంగా జబర్దస్త్‌పై నెగిటివిటీ పెరిగిపోయింది. పేరున్న కమెడియన్స్ అందరూ జబర్దస్త్ వదిలి వెళ్లిపోవమే దీనికి ముఖ్య కారణం. దీంతో ఈ షోలో కామెడీ తగ్గిపోయి, కాంట్రవర్సీ ఎక్కువయిపోయిందని నెటిజన్లు విమర్శించడం మొదలుపెట్టారు. ఇక జబర్దస్త్ ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకున్న రీల్ కపుల్ సుధీర్, రష్మి.
సుధీర్, రష్మీ.. వీరిద్దరి కెమిస్ట్రీకి బుల్లితెరపై చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వీరు కూడా రియల్ కపుల్‌లాగా కలిసి మెలిసి ఉంటారు. వీరిద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని ఎన్నోసార్లు ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. కానీ అదంతా స్క్రీన్‌పైనే. వీరెప్పుడూ ఆఫ్ స్క్రీన్ కలిసి కనిపించడం కానీ.. చట్టాపట్టాలు వేసుకొని తిరగడం కానీ జగరలేదు. దీంతో వీరు కేవలం రీల్ కపులే అని కొందరికి క్లారిటీ వచ్చినా మరికొందరు మాత్రం వీరు రియల్ కపుల్ కూడా అని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక సుధీర్ పేరు జబర్దస్త్‌లో వినిపిస్తుంది అంటే తనతో పాటు మరో రెండు పేర్లు దానికి జతచేరుతాయి. అదే రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను. ప్రస్తుతం సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోయి వారి సినీ కెరీర్‌పై దృష్టిపెట్టారు. తాజాగా గెటప్ శ్రీను మరోసారి సుధీర్, రష్మీ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సుధీర్, రష్మీ కేవలం స్క్రీన్‌పైనే అలా ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత సుధీర్, రష్మీ వేర్వేరు లోకాలు అని స్పష్టం చేశాడు. మరి ఈ విషయంపై ఈ రీల్ కపుల్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com