God Father : చిరు, సల్మాన్ కలిసి స్టెప్పేస్తే.. తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజ్..

God Father : చిరు, సల్మాన్ కలిసి స్టెప్పేస్తే.. తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజ్..
God Father : సాంగ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్, సల్మాన్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది

God Father : మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన తార్ మార్ తక్కర్ మార్ పాటర ప్రొమోని మేకర్స్ రిలీజ్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్, ఇద్దరితీ అద్భుతమైన పాటను తెరకెక్కించినట్లు దర్శకుడు మోహన్ రాజా గతంలో మనకు చెప్పిన మాట తెలిసింది. ఆ సాంగ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్, సల్మాన్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 15న మొత్తం సాంగ్ ప్లే చేయనున్నట్లు గాడ్ ఫాదర్ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

మలయాళం 'లూసీఫర్'కి గాడ్ ఫాదర్ రీమేక అని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్ పాత్రలో తెలుగుతో చిరంజీవి కనిపించనున్నరు. యాక్షన్ పొలిటికల్ డ్రామా నేపధ్యంలో కథ సాగుతుంది. మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 5 దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది.

Tags

Next Story