Godfather Movie: చిరంజీవి 'గాడ్ ఫాదర్'కు రిలీజ్ డేట్ ఫిక్స్..

Godfather Movie: సీనియర్ హీరో చిరంజీవి.. యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేయడమే కాకుండా వెంటవెంటనే వాటి షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో చాలావరకు రీమేక్‌లే అయినా.. దర్శకులు కథలో మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది.
చిరంజీవి చివరిగా కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య'లో కనిపించారు. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించడం సినిమాకు హైప్ క్రియేట్ చేసినా.. ఆ హైప్‌కు తగినట్టుగా మూవీ హిట్ అవ్వలేకపోయింది. దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లొచ్చిన చిరంజీవి.. మళ్లీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రం.. తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అయితే ఈ మూవీని ముందుగా ఆగస్ట్ 12న విడుదల చేయాలని నిర్ణయించింది మూవీ టీమ్. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలవ్వకపోవడంతో సెప్టంబర్ 30న గాడ్ ఫాదర్ విడుదల ఉండబోతుందని టాక్. ఇక మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న 'భోళా శంకర్' కూడా జూన్ 21 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com