GodFather Teaser: 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల.. మాటల్లేవ్.. ఓన్లీ యాక్షన్..

GodFather Teaser: గాడ్ ఫాదర్ టీజర్ విడుదల.. మాటల్లేవ్.. ఓన్లీ యాక్షన్..
GodFather Teaser: మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రం.. తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కిస్తున్నారు చిరు.

GodFather Teaser: సీనియర్ హీరో చిరంజీవి.. యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేయడమే కాకుండా వెంటవెంటనే వాటి షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో చాలావరకు రీమేక్‌లే అయినా.. దర్శకులు కథలో మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'గాడ్ ఫాదర్' నుండి టీజర్ విడుదలయ్యింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రం.. తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ షూటింగ్ స్పాట్ నుండి మూవీ టీమ్ ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ విడుదల చేస్తూనే ఉంది.

తాజాగా విడుదలయిన 'గాడ్ ఫాదర్' టీజర్‌లో అందరి నటీనటులకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా దర్శకుడు మోహన్ రాజా బాగా చూపించారు. ఇక ఈ టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లాగా వినిపించిన పాట మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. టీజర్‌లో పెద్దగా డైలాగులు లేకపోయినా యాక్షన్ మాత్రం అదిరిపోయేలా ఉంది. సత్యదేవ్, సముద్రఖని, నయనతార, సల్మాన్ ఖాన్.. ఇలా ముఖ్యమైన తారాగణాన్ని టీజర్‌లో కవర్ చేసింది గాడ్ ఫాదర్ టీమ్.


Tags

Read MoreRead Less
Next Story