Gopichand: జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే: గోపీచంద్
Gopichand: విలన్‌లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోలు అయినా నటులు కూడా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లో అలాంటి వారు ఎవరంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు గోపీచంద్. గోపీచంద్ విలనిజాన్ని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడినా.. ఆ తర్వాత హీరోగా ఆఫర్లు రావడంతో విలన్ రోల్స్‌ను దూరం పెట్టేశాడు. అయితే తాను ముందు విలన్‌గా నటించిన జయం సినిమా కోసం గోపీచంద్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడో ఇటీవల బయటపెట్టాడు.
తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమా నేటితో 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఒక పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీతో హీరోగా పరిచయమయిన నితిన్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో విలన్‌గా నటించిన గోపీచంద్‌కు కూడా అంతే గుర్తింపు లభించింది. కానీ ఇందులో తన రెమ్యునరేషన్ మాత్రం తన పర్ఫార్మెన్స్ రేంజ్‌లో లేదు.
గోపీచంద్ హీరోగా నటించిన తరువాతి చిత్రం 'పక్కా కమర్షియల్' చిత్రం జులై 1న విడుదల కానుంది. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇదే సందర్భంలో తాను జయం సినిమా కోసం రూ.11 వేలు పారితోషికంగా తీసుకున్నట్టు బయటపెట్టాడు. తేజ లక్కీ నెంబర్ రూ.11 వేలని అందుకే ఆయన అంతే రెమ్యునరేషన్ ఇచ్చారని అన్నారు. అయితే ఆ రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు మరో సున్న ఉండుంటే బాగుండేదని గోపీచంద్ ఫీలయ్యాడట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com