HBD Ram Charan : మెగా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్...!

HBD Ram Charan : మెగా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్...!
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి షార్ట్ టైంలోనే టాప్ హీరో అయిపోయాడు. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు.

రామ్ చరణ్.. చిరుతలా దూసుకొచ్చి మెగాఅభిమానులకు నాయక్ లా మారిన మగధీరుడు. డైనమిక్ డాన్స్ లతో, స్టన్నింగ్ స్టంట్స్ తో సాలిడ్ హిట్స్ కొడుతున్న మెగాపవర్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి షార్ట్ టైంలోనే టాప్ హీరో అయిపోయాడు. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు. రీసెంట్ గా నిర్మాతగా మారి ఆ రంగంలోనూ అదరగొడుతున్నాడు. మెగాస్టార్ వారసుడు అనే మాటను ఎప్పుడో మర్చిపోయేలా చేసి.. ఇప్పుడు తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా మెగా రంగస్థల వారసుడైన రామ్ చరణ్ పై బర్త్ డే స్పెషల్.

చిరంజీవి వారసుడుగా సులువుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ అనుకున్నారు చాలామంది. కానీ అతను వచ్చింది మెగా వారసుడుగా. అతని ఎంట్రీ సులువుగానే ఉండొచ్చు. కానీ అంతకు మించిన బరువు కూడా ఉంది. ఆ బరువును తొలి సినిమాకే మాగ్జిమం దింపేసుకున్నాడు చరణ్. ఫస్ట్ మూవీకి బెస్ట్ అనిపించుకోకున్నా మెగాస్టార్ వారసుడుగా నిలబడతాడు అనిపించుకున్నాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి కథలు పడ్డప్పుడల్లా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ టాలీవుడ్ రంగస్థలంపై మెగా జెండా పాతేశాడు.

ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కానీ చిరంజీవికి ఖైదీ వంటి పాత్ బ్రేకింగ్ మూవీ పడలేదు. కానీ రామ్ చరణ్ కు రెండో సినిమాకే ఆ బ్రేక్ వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీరలో రామ్ చరణ్ ధీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కొక్కణ్నీ కాదు షేర్ ఖాన్.. వందమందినీ ఒకేసారి రమ్మను అంటూ ఆ లేత గొంతులో పలికిన డైలాగ్స్ కు వందల రికార్డ్స్ కనుమరుగయ్యాయంటే అతిశయోక్తేముందీ.

సక్సెస్ ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. ఆ నమ్మకంలో ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. రామ్ చరణ్ విషయంలోనూ అదే జరిగింది. తక్కువ టైమ్ లోనే మాస్ హీరోగా ఎలివేట్ అయిన చరణ్ ను బాలీవుడ్ కు పంపాలన్న ఆలోచన ఎవరిదో గానీ.. అది ఓ బ్యాడ్ డెసిషన్ అని తెలియడానికి జంజీర్ వంటి డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ చేసిన జంజీర్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ తుఫాన్ గా వచ్చింది. కానీ రెండు చోట్లా డిజాస్టర్. దీంతో ఇక ప్రయోగాలు చేయకూడదన్న విషయం తేలిపోయింది.

ఒక రకంగా చూస్తే బ్రూస్ లీ వరకూ రామ్ చరణ్ కెరీర్ లో కంటిన్యూస్ హిట్స్ లేవు. ఒక హిట్టు ఒక ఫ్లాపు అన్నట్టుగానే ఉంది. మరోవైపు పోటీ పెరుగుతోంది. అలాగే తెలుగులో కొత్త కథలకు ఆదరణ మొదలైంది. స్టార్ హీరోలు రొటీన్ మూస నుంచి బయటకు వస్తున్నారు. దీంతో రామ్ చరణ్ కూడా అదే చేశాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ ను తెలుగులో ధృవగా రీమేక్ చేసి తనూ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీతో చరణ్ కెరీర్ కొత్త టర్న్ ఇచ్చుకుంది. అంటే తనూ ప్రయోగాలు చేయొచ్చు అనే నమ్మకాన్ని పెంచింది.

Tags

Read MoreRead Less
Next Story