Happy Birthday RamCharan: రామ్ చరణ్ మరెంతో ఎదగాలి... మన్ననలు పొందాలి: పవన్ కల్యాణ్

Happy Birthday RamCharan: రామ్ చరణ్ మరెంతో ఎదగాలి... మన్ననలు పొందాలి: పవన్ కల్యాణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు బాబాయ్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాశీస్సులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యామ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివని కొనియాడారు. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story