మీరొక్కరే తాగుతారా.. రాజీవ్‌కి కూడా ఇస్తారా: వంశీ డౌట్‌కి సుమ!!

మీరొక్కరే తాగుతారా.. రాజీవ్‌కి కూడా ఇస్తారా: వంశీ డౌట్‌కి సుమ!!
ఇక సినిమా ఆడియో ఫంక్షన్లంటే సుమ తరవాతే ఎవరైనా అనేంతగా ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపే చూస్తుంది.

నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు అలానే ఉన్నారు.. ఎవరైనా యాంకర్ సుమని చూస్తే అలానే అంటారేమో.. 20 ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీతో స్టేజ్ మీద నవ్వులు పూయిస్తుంది.. సుమ షో అంటే పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అందరూ హ్యాపీగా చూసేయొచ్చు. ఇక సినిమా ఆడియో ఫంక్షన్లంటే సుమ తరవాతే ఎవరైనా అనేంతగా ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపే చూస్తుంది.

స్పాంటేనియస్‌గా మాట్లాడుతుంది.. మాటల మధ్యలో సెటైర్లు, జోకులు.. ఆడియన్స్‌కి అస్సలు బోరు కొట్టదు సుమ యాంకరింగ్ అంటే. కోవిడ్ సీజన్ తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా ఇండస్ట్రీ పట్టాలెక్కుతుంది. తాజాగా రవితేజ నటించిన క్రాక్ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకను సుమ హోస్ట్ చేయగా.. హ్యాపీ డేస్ నటుడు వంశీ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. వంశీ వేదికపైకి వచ్చి సుమపైనే పంచ్‌లు వేసి నవ్వులు పూయించాడు.

మైక్ అందుకున్న వంశీ.. నా ఫస్ట్ క్వచ్ఛన్ మీకే సుమ గారు అన్నాడు.. ఏంటో అడుగు అని సుమ అనడంతో.. ఇంట్లో మీరొక్కరే తాగుతారా.. రాజీవ్ గారికి కూడా ఇస్తారా అని పంచ్ వేశాడు. దానికి సుమ నవ్వుతుండగా అందేనండి.. అమృతం.. నేను మాట్లాడేది అమృతం గురించి.. వయసు మింగేశారా మీరు అని వంశీ అనడంతో.. నీకు బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందా అని వంశీకి రివర్స్ పంచ్ వేసింది సుమ.

నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలానే ఉన్నారు.. ఇప్పుడూ ఇలానే ఉన్నారు. ఇంకో పదేళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటారా అని అడగడంతో.. ఏం లేదు.. మేం మాస్ మహరాజా రవితేజ గారిని ఫాలో అయిపోతాం.. ఆయన ఎనర్జీ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు కదా అని సుమ ఆన్సర్ ఇవ్వగా.. బిస్కెట్ ఫ్యాక్టరీ గురించి మీరు చెప్తున్నారు అంటూ వంశీ రివర్స్ పంచ్ వేశాడు.. వెంటనే రవితేజ నవ్వుతూ ఇది కరెక్ట్ అన్నట్టు సైగ చేశారు.. బిస్కెట్ కాదండీ ఇది రియల్ అని సుమ కవర్ చేసుకుంది.

మొత్తానికి సుమ, వంశీల మధ్య సంభాషణ ఆడియో ఫంక్షన్‌లో హైలెట్ అయింది. కాగా వంశీ.. హ్యాపీడేస్, కరోనా వైరస్, వంగవీటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రాక్ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. రవితేజ లాగే తాను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చానని, ఆయనతో వర్క్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుందని, లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడరని తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు వంశీ.

Tags

Read MoreRead Less
Next Story