భాగ్ సాలే లో కొత్త కామెడీ చూస్తారు: హరీష్ శంకర్

భాగ్ సాలే లో కొత్త కామెడీ చూస్తారు: హరీష్ శంకర్
X
త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోన్న భాగ్ సాలే

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్లు హరీష్‌ శంకర్, దశరద్, వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'మత్తువదలరా సినిమా చూశాక సింహాకు ఫ్యాన్ అయ్యాను. కలర్ ఫోటో సినిమా చూసి కాళ భైరవకు ఫ్యాన్ అయ్యాను. ఈ ఇద్దరూ ఎంతో ఒదిగి, ఎంతో సింపుల్‌గా ఉంటారు. ప్రణీత్ తీసిన సూర్యకాంతం సినిమా నాకు నచ్చింది. భాగ్ సాలే కథ నాకు చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అంతా సరదాగా సాగుతూ ఉంటుంది. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్తుంటారు. కానీ కాలేజ్ ఎగ్గొట్టి ఈ సినిమాను తీసినట్టుగా అనిపిస్తుంది. ప్రణీత్‌కు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ప్రతీసారి ప్రొగ్రెస్‌మెంట్ గురించి ఆలోచిస్తుంటాడు. నేను ఈ సినిమాను నిర్మించాల్సింది కానీ మిస్ అయింది. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. కాళ భైరవ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. తండ్రి పేరును నిలబెడతాడు. జూలై 7న మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడబోతోన్నారు. నేను, విష్ణు కలిసి ప్రణీత్‌తో ఓ సినిమాను చేయబోతోన్నాం. సింహాలో మంచి టైమింగ్‌ ఉంటుంది. అంతే కాకుండా మంచి సంస్కారం, వ్యక్తిత్వం ఉంది' అని అన్నారు.

అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. 'భాగ్ సాలే అనేది క్రైమ్ కామెడీ జానర్. నాకు ఆ జానర్ సినిమాలు చాలా ఇష్టం. ట్రైలర్‌ చూశాక సినిమా హిట్ అవుతుందని మరింత నమ్మకంగా కలిగింది. జూలై 7న ఈ సినిమా రాబోతోంది. మ్యూజిక్ బాగా వచ్చింది. కాళ భైరవ రీరికార్డింగ్ అద్బుతంగా వచ్చింది. కాస్త ఆలస్యం అయింది కానీ అద్భుతంగా చేశాడు. ప్రణీత్‌కు మంచి ఫ్యూచర్‌. ఆయనతో త్వరలోనే మరో సినిమా చేస్తాను. దళపతి విజయ్‌లో ఉండే ఇన్నోసెన్స్‌ సింహాలో ఉందని ఓ ఓటీటీ హెడ్ అన్నారు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఈ అన్నదమ్ములిద్దరికీ కొంచెం కూడా గర్వం లేదు. మా ఈవెంట్‌కు వచ్చిన గెస్టులకు థాంక్స్. జూలై 7న థియేటర్లో అందరినీ నవ్వించబోతోన్నామ'ని అన్నారు.

శ్రీ సింహా మాట్లాడుతూ.. 'మా ఈవెంట్‌కు వచ్చిన హరీష్‌ శంకర్ గారు, దశరద్ గారు, వశిష్ట, విష్ణు గారికి థాంక్స్. మా సినిమా గురించి వీడియో బైట్ ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్స్. వాయిస్ ఓవర్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డకు థాంక్స్. రాజీవ్ మామ, జాన్‌ వంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ రమేష్, ఆర్ట్ డైరెక్టర్ శ్రుతి, ఎడిటర్‌ కార్తిక్‌లకు థాంక్స్. కాళ భైరవ మాకు మ్యూజిక్ చేయడం ఆనందంగా ఉంది. ప్రణీత్ అన్న ఎప్పుడూ కూడా ఇంప్రూవ్‌మెంట్ కోసం చూస్తుంటాడు. షూటింగ్‌కు వెళ్లే ముందు వరకూ పదిహేను వర్షెన్స్‌ రాసుకున్నారు. మా సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు అర్జున్, యశ్ గారికి థాంక్స్. జూలై 7న థియేటర్లోకి ఈ సినిమా రాబోతోంది. అందర్నీ కచ్చితంగా నవ్విస్తామ'ని అన్నారు.

ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మాట్లాడుతూ.. 'మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డకు థాంక్స్‌. ట్రైలర్ చూసి చిరంజీవి గారు కాంప్లిమెంట్ ఇవ్వడం మరిచిపోలేని ఘటన. ఇక్కడకు గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌, దశరధ్, వశిష్టలకు వచ్చిన థాంక్స్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు మా అమ్మానాన్నలు ఎంతగానో సపోర్ట్ చేశారు. నా సిస్టర్ విన్నికి థాంక్స్. స్క్రీన్ మీద కనిపించే హీరో శ్రీసింహా. కనిపించని హీరో కాళభైరవ. మా నిర్మాత అర్జున్ సర్‌తో ఒక్కసారి పని చేస్తే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. ఆయన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. భాగ్ సాలే అనేది యూనిక్ టైటిల్. ఈ సినిమాలో అన్నీ కూడా యూనిక్ కారెక్టర్లుంటాయి. ఇందులో ఖతర్నాక్ కారెక్టర్ ఉంటుంది. శ్రీసింహా అద్భుతంగా నటించారు. ఆయన నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు సినిమాలన్నీ కూడా ధమ్ బిర్యానీలా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మాది ఇరానీ చాయ్ లాంటి సినిమా. ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మిమ్మల్ని వంద శాతం నవ్విస్తుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.

దశరధ్ మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూశాను. నాకు చాలా బాగా వచ్చింది. కాళ భైరవ ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ప్రణీత్‌కు మంచి డైలాగ్స్ రాసే కెపాసిటీ ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌' అని అన్నారు.

వశిష్ట మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ప్రణీత్‌కు కంగ్రాట్స్. సింహా టైమింగ్ బాగుంది. కాళ భైరవ సంగీతం బాగుంటుంది. మేం అంతా కూడా ఒకే కాలేజ్. జూలై 7న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల'ని కోరుకుంటున్నాను.

యశ్ రంగినేని మాట్లాడుతూ.. 'భాగ్ సాలే సినిమా రెండేళ్ల క్రితం మొదలైంది. అర్జున్ గారి ఈ ప్రాజెక్ట్‌ను ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాను ఇప్పటికే రెండు సార్లు చూశాను. ఎంతో ఎంటర్టైనింగ్‌గా వచ్చింది. ఇన్ని పాత్రలను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కాళ భైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సింహా ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. జూలై 7న థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు.

విష్ణు ఇందూరి మాట్లాడుతూ.. 'ప్రణీత్ నాకు ముందు నుంచీ పరిచయం. ఈ సినిమా ట్రైలర్ చూశాను. సినిమా అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. కుర్రాళ్లంతా కలిసి తీసిన సినిమాను మనమంతా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అంతా కూడా పీరియడ్ డ్రామా, యాక్షన్ డ్రామాలు వస్తుంటే.. ఓ క్రైమ్ కామెడీ జానర్లో సినిమాను తీసిన నిర్మాతలకు హ్యాట్సాఫ్. జూలై 7న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు.

కాళ భైరవ మాట్లాడుతూ.. 'జూలై 7 కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను. రెండు గంటల సినిమా అస్సలు టైం తెలియకుండా అయిపోతుంది. ఒక్కసారి చూసిన వాళ్లు మళ్లీ కచ్చితంగా వచ్చి చూస్తారు' అని అన్నారు.

కెమెరామెన్ రమేష్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో నాకు సింహా, కాళ భైరవలు బ్రదర్స్ వంటి వారు. ఈ సినిమాతో ప్రణీత్‌ మరో బ్రదర్ అయ్యాడు. భాగ్ సాలే టైటిల్ నాకు ఈ సినిమా షూటింగ్‌లో సెట్ అయింది. ఇప్పుడు కూడా వేరే ఊర్లో షూటింగ్‌లో ఉంటే వచ్చాను' అని అన్నారు.

Tags

Next Story