క్రైమ్ థ్రిల్లర్‌ 'హసీనా' మే 19న విడుదల

క్రైమ్ థ్రిల్లర్‌ హసీనా మే 19న విడుదల
X
ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన చిత్రం 'హసీనా'

ప్రియాంక డే టైటిల్ రోల్‌లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన చిత్రం 'హసీనా'. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించగా తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్‌ను అడివి శేష్ ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి స్పందనే లభించింది. అయితే తాజాగా మేకర్స్‌ హసీనా మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. మే 19న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృదం ప్రకటించింది.

Tags

Next Story