టాలీవుడ్

'బుల్లెట్టు బండి'కి అసలు సెలబ్రిటీ ఈ ఆంధ్రా పిల్లే..!

'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అంటూ సాగే ఈ పల్లెటూరి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాస్తావానికి పాట వచ్చి చాలా రోజులైంది.

బుల్లెట్టు బండికి అసలు సెలబ్రిటీ ఈ ఆంధ్రా పిల్లే..!
X

'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అంటూ సాగే ఈ పల్లెటూరి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాస్తావానికి పాట వచ్చి చాలా రోజులైంది. కానీ మళ్ళీ ఈ పాటకి క్రేజ్ రావడానికి కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తాజాగా తన పెళ్లి బరాత్ లో ఈ పాటకి డాన్స్ చేసి ఆదరగోట్టింది ఈ తెలంగాణ పిల్ల. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపొయింది. ఈ పాటని అంతగా ఒన్ చేసుకొని తన భర్త ముందు తన ప్రేమను డాన్స్ రూపంలో ఒలకబోస్తూ చూపించింది సాయిశ్రీయ. ఇదే నెటిజన్లని కట్టిపడేసింది. వైరల్ అయ్యే ఈ వీడియో చూసాక చాలామంది మళ్ళీ ఒరిజినల్ వీడియో సాంగ్ చూశారు. కానీ అంతలా ఆ అమ్మాయి కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం సింగర్ మోహనా భోగరాజు.

'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అనే పాటను పాడింది సింగర్ మోహనా భోగరాజు... అసలు ఈ పాటను ఎవరు పాడారు అన్నది చాలామందికి ఇప్పటికి తెలియదు కూడా.. లక్ష్మణ్‌ కలం నుంచి జాలువారిన ఈ పాటకి ఎస్‌కే బాజి సంగీతం అందించారు. అచ్చమైన తెలంగాణ స్లాంగ్ తో కూడిన ఈ పాటను ఒన్ చేసుకొని మరి పాడింది మోహనా భోగరాజు... తెలంగాణ స్లాంగ్ ని పట్టుకోవడం అంటే అంత ఈజీ పని కాదు. తెలంగాణలో పుట్టిన వాళ్ళకైతే ఆటోమేటిక్ ఆ యాస వస్తుంది. కానీ మోహనా భోగరాజు పక్కా ఆంధ్రా అమ్మాయి.. ఏలూరులో పుట్టింది. అయినప్పటికీ తెలంగాణ స్లాంగ్ తో కూడిన ఆ పదాలను భలే పట్టుకుంది. ఒక్కోసారి ఆ పాట వింటుంటే పాడింది పక్కా తెలంగాణ అమ్మాయేనా అనుకుంటారు అందరూ.. ఎంతో నిబద్దత ఉంటే తప్పా ఆ పదాలను ఆ స్లాంగ్ లో పట్టుకోలెం.. అంతలా ఆ పాటను ఒన్ చేసుకుంది మోహనా భోగరాజు. అందుకు ఆమెకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


మోహన్ భోగరాజు బీటెక్ చేశాక ఇండస్ట్రీలోకి వచ్చింది. సింగర్ గా అవకాశాలు వచ్చాక ఎంబీఏ కంప్లీట్ చేసింది. టెక్నాలజీ ఇంత పెరిగిన ఇంకా సోషల్‌మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో రెడ్డమ్మ తల్లి అనే పాట ఆమెకి ఫుల్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో 'మగువా మగువా' ఫిమేల్‌ వెర్షన్‌ పాడింది కూడా మోహననే.. ఆమె గాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో.

Next Story

RELATED STORIES