21న హలో మీరా..ఇది డైరెక్టర్ సాహసమే..!

21న హలో మీరా..ఇది డైరెక్టర్ సాహసమే..!
సినిమా అనగానే భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్ మన బుర్రలో గిర్రున తిరుగుతుంటాయి

సినిమా అనగానే భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్ మన బుర్రలో గిర్రున తిరుగుతుంటాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడమంటే సాహసమే అని చెప్పుకోవాలి. ఎంతో ధైర్యం, కథపై నమ్మకం ఉంటే తప్ప అలాంటి సినిమా తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేడు. అయితే అదే రీతిలో చేసి చూపించాడు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.

ప్రఖ్యాత డైరెక్టర్ బాపు వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. బాపు చివరి సినిమా వరకు వెన్నంటే ఉండి ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చారు శ్రీనివాస్‌. అదే అనుభవాన్ని రంగరిస్తూ.. తన ప్రతిభను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని హలో మీరా అనే సినిమా రూపొందించారు. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్‌‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

ఒకే ఒక్క పాత్ర‌లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులువు కాదు. కానీ తన కథ పట్ల, కళా నైపుణ్యం పట్ల తనకున్న అపారమైన నమ్మకంతో అలాంటి సాహసం చేస్తూ ప్రయోగాత్మక సినిమా తీశారు కాకర్ల శ్రీనివాస్. తెరపై కేవలం ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.

ఇప్పటికే హలో మీరా సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ రిలీజ్ చేసి తన సినిమాలోని వైవిధ్యాన్ని, ప్రయోగాత్మక విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.. ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు.సినిమా అంటేనే కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుంటున్న ఈ రోజుల్లో గొప్ప సినిమా తీశారని, ఆడియో విజువల్ టెక్నాలజీలో తీసిన ఈ హలో మీరా సినిమా ప్రేక్షకులకు ఎన్నడూలేని డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story