Hemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు..? సోషల్ మీడియానే ఆధారం..

Hemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు..? సోషల్ మీడియానే ఆధారం..
Hemachandra: సింగర్స్‌లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అందులో సీనియర్ జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి.

Hemachandra: ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా పలు కారణాల వల్ల కొన్ని జంటలు విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈమధ్యకాలంలో విడాకుల వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా కారణాలు చెప్పకుండా విడిపోతున్నామని ఒక స్టేట్‌మెంట్‌తో వారి డైవర్స్ విషయాన్ని బయటపెడుతున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ జంట కూడా విడాకులు తీసుకోబోంతుందన్న వార్త వైరల్‌గా మారింది.

నటీనటులలోనే కాదు సింగర్స్‌లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అందులో సీనియర్ జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి. వీరు ఓ సింగింగ్ షోలో కలుసుకొని.. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వీరి వివాహం జరగగా.. 2016లో వీరికి శిఖర చంద్రిక అనే కూతురు పుట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రొఫెషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే వీరి విడాకుల వార్త వైరల్ అయ్యింది.

ఈ రూమర్ ఎక్కడ మొదలయ్యిందో తెలియదు కానీ.. హేమచంద్ర, శ్రావణ భార్గవి త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా వీరిద్దరు చివరిసారిగా తెలుగు ఇండియన్ ఐడిల్ షోలో కలిసి పాటపాడి అలరించారు.

Tags

Read MoreRead Less
Next Story