Hemachandra: విడాకులంటూ ప్రచారం.. స్పందించిన శ్రావణ భార్గవి, హేమచంద్ర..

Hemachandra: సింగర్స్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో సీనియర్ జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి. వీరు ఓ సింగింగ్ షోలో కలుసుకొని.. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వీరి వివాహం జరగగా.. 2016లో వీరికి శిఖర చంద్రిక అనే కూతురు పుట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రొఫెషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే వీరి విడాకుల వార్త వైరల్ అయ్యింది. దీనిపై వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియాల్లో స్పందించారు.
హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వార్త బయటికి వచ్చి ఇప్పటికి చాలారోజులే అయ్యింది. అయితే ఈ వార్తలపై వారిద్దరూ ఇంకా స్పందించకపోవడం కూడా ఇవన్నీ నిజమే అనిపించేలా చేశాయి. అందుకే ముందుగా వీటిని ఉద్దేశించి హేమచంద్ర.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'నా సాంగ్‌కంటే చాలా తొందరగా అనవసరమైన సమాచారమే వ్యాపిస్తుంది' అని పోస్ట్ చేశాడు హేమచంద్ర.
ఇక శ్రావణ భార్గవి కూడా 'గత కొన్నిరోజులుగా నా యూట్యూబ్ వ్యూస్ పెరిగాయి. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. నేను రోజూ చేసేదానికంటే ఎక్కువ పని వస్తోంది. నేనూ ఇదవరకు కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాను. మంచిదే కదా. నిజమో, అబద్ధమో. మీడియో ఒక వరం.' అని చెప్పుకొచ్చింది. అయితే వారిద్దరూ చేసిన ఈ రెండు పోస్టులకు ఒకరిని ఒకరు ట్యాగ్ కూడా చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com