Tollywood: HER రిలీజ్ డేట్ పోస్టర్

Tollywood:  HER రిలీజ్ డేట్ పోస్టర్


చి.ల.సౌ|| సినిమాతో రుహాని శర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా రుహాణి కొత్త జానర్‌ను ఎంచుకుంది. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

HERను సురేష్ ప్రొడక్షన్స్ థియేటర్లలో విడుదల చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత డి. సురేష్‌ బాబు రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి.

Tags

Read MoreRead Less
Next Story