Ante Sundaraniki OTT: 'అంటే.. సుందరానికీ' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Ante Sundaraniki OTT: జూన్ మొత్తం మూవీ లవర్స్‌కు పండగలాగా అయిపోయింది. విడుదలయిన చాలావరకు సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంతో.. సూపర్ హిట్‌ను అందుకున్నాయి. అందులో ఒకటి నాని నటించిన 'అంటే సుందరానికీ'. నేచురల్ స్టార్ నాని సినిమాగా ముందుగానే అంటే సుందరానికీకి హైప్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత ప్రేక్షకుల దగ్గర నుండి కూడా మంచి టాక్ అందుకొని మూవీ హిట్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది.
నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే 'అంటే సుందరానికీ'. క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా ఇప్పటికీ దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అప్పుడే ఎదురుచూడడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.
జూన్ 10న అంటే సుందరానికీ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి కూడా తొందరగానే వచ్చేస్తుందని సమాచారం. జులై 8 నుండి అంటే సుందరానికీ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందట. ఇక చాలా ఇతర సినిమాలలాగా అంటే సుందరానికీ కూడా ముందుగానే ఓటీటీలో విడుదలయ్యి నాని ఫ్యాన్స్‌ను అలరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com