Liger Movie: 'లైగర్' రెమ్యునరేషన్.. విజయ్ కంటే మైక్ టైసన్‌కే ఎక్కువ..!

Liger Movie: లైగర్ రెమ్యునరేషన్.. విజయ్ కంటే మైక్ టైసన్‌కే ఎక్కువ..!
Liger Movie: విజయ్ దేవరకొండ కెరీర్‌లో 'లైగర్' తొలి పాన్ ఇండియా చిత్రం.

Liger Movie: బాక్సింగ్‌కే కింగ్‌లాంటి మైక్ టైసన్ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారంటేనే.. ఆ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అది కూడా పూరీ జగన్నాధ్ లాంటి డైనమిక్ డైరెక్టర్ డైరెక్షన్‌లో నటిస్తే.. ఊహకు కూడా అందని యాక్షన్‌ మన కళ్ల ముందు ఉండే ఛాన్స్ ఉంది. అందుకే 'లైగర్' పక్కా హిట్ అవుతుందని నమ్ముతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలో నటించడానికి మైక్ టైసన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో 'లైగర్' తొలి పాన్ ఇండియా చిత్రం. అయినా కూడా ఈ సినిమా కోసం విజయ్ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. పైగా లైగర్ విడుదలయ్యే వరకు విజయ్ మరే ఇతర సినిమాలు ప్రారంభించడానికి వీలు లేదు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటూ దేశాన్ని చుట్టేస్తున్నాడు ఈ రౌడీ హీరో.

లైగర్‌లో నటించడం కోసం విజయ్ దేవరకొండ రూ. 35కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికీ తెలుగులో కేవలం స్టార్ హీరోలకు మాత్రమే అంత రెమ్యునరేషన్ అందుతోంది. అయితే ఇందులో కీ రోల్ చేయడం కోసం మైక్ టైసన్‌కు విజయ్‌కంటే ఎక్కువే పారితోషికం అందజేశారట. లైగర్ కోసం మైక్ టైసన్ రెమ్యునరేషన్ రూ. 40 కోట్లని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్.. ఆగస్ట్ 25న విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story