టాలీవుడ్

Sita Ramam OTT: 'సీతారామం' ఓటీటీ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Sita Ramam OTT: దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ ‘సీతారామం’లో సీతారాములుగా నటించారు.

Sita Ramam OTT: సీతారామం ఓటీటీ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
X

Sita Ramam OTT: గత నెలలో విడుదలయిన తెలుగు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ ఆగస్ట్ మొదట్లోనే విడుదలయిన 'సీతారామం' మంచి హిట్ టాక్‌తో ముందుకెళ్తోంది. తెలుగులో విభిన్న ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హను రాఘవపూడి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ఓటీటీ వివరాల గురించి నెట్టంట్లో చర్చ సాగుతోంది.


దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ 'సీతారామం'లో సీతారాములుగా నటించారు. రష్మిక మందనా.. ఆఫ్రీన్ అనే కీ రోల్‌లో కనిపించింది. వీరి ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 1960ల్లో జరిగిన ఓ క్లాసికల్ లవ్ స్టోరీగా అప్పుడే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేస్తోంది. కలెక్షన్స్ విషయంలో కూడా సీతారామం దూసుకుపోతోంది. ఇందులోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్మారు. వారు నమ్మినట్టుగానే మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

మామూలుగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలయిన ఆరు వారాలు తర్వాత, అంటే రెండు నెలలలోపు ఓటీటీలో విడుదల కాకూడదని నిర్మాతలు నిర్ణయించారు. కానీ మూవీకి వెంటనే ఫ్లాప్ టాక్ వచ్చేస్తే మాత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నారు. సీతారామంకు అలా కాదు కాబట్టి.. ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు వారాలు పడుతుందని సమాచారం. ఇక సీతారామం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని టాక్.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES