Bimbisara OTT: 'బింబిసార' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

Bimbisara OTT: ప్రస్తుతం ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వగానే ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడడం మొదలుపెడుతున్నారు. అంతే కాకుండా సినిమాకు టాక్ కొంచెం అటూ ఇటూగా వచ్చినా కూడా మూవీ టీమ్.. ఓటీటీ రిలీజ్‌కు తొందరగానే అంగీకరిస్తోంది. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలయిన 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
కళ్యాణ్ రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది 'బింబిసార'. అంతే కాకుండా తన కెరీర్‌లో ఈ సినిమానే అత్యంత భారీ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను కూడా సాధించింది. మొదటిరోజు 'బింబిసార' ప్రపంచవ్యాప్తంగా రూ.7.27 కోట్లను కలెక్ట్ చేసింది. దీంతో కళ్యాణ్ రామ్‌తో పాటు మూవీ టీమ్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే సమయంలో బింబిసార ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని ఎదురవుతున్న ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం ఇచ్చారు.
ముందుగా థియేటర్లలో సినిమా విడుదలయిన రెండు నెలల వరకు ఓటీటీలో రిలీజ్ కాకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకవేళ చిత్రానికి ఫ్లాప్ టాక్ వస్తే.. వారే ఓటీటీ విడుదలను తొందరగా చేసేస్తు్న్నారు. ప్రస్తుతం బింబిసారకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. అందుకే 50 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందట. అంటే సెప్టెంబర్ 23న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com