Pushpa 2 The Rule: 'పుష్ప 2' నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అలాంటి పాత్రలో బన్నీ..

Pushpa 2 The Rule: పుష్ప 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అలాంటి పాత్రలో బన్నీ..
Pushpa 2 The Rule: పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇటీవల దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.

Pushpa 2 The Rule: తెలుగులో తెరకెక్కిస్తున్న చాలావరకు పాన్ ఇండియా సినిమాలు.. కలెక్షన్ల మోత మోగిస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకెళ్తున్నాయి. ఆ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు 'పుష్ప'. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప.. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అందుకే పుష్ప 2 గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక స్మగ్లర్‌గా డీ గ్లామర్ పాత్రలో కనిపించి అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ స్టార్‌గా ఉండే బన్నీ.. డీ గ్లామర్ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అన్న అనుమానం లేకుండా తన పాత్రను బాగా డిజైన్ చేసి.. హిట్ అందుకున్నాడు సుకుమార్. అయితే పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌గా జరుగుతుండగా.. ఇటీవల దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.

'పుష్ప 2'లో అల్లు అర్జున్ నడివయసు పాత్రలో కనిపించనున్నాట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాత్ర ఒక సీన్ వరకే పరిమితమా.. లేకా చాలాసేపు ఉంటుందా అన్న విషయం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది. పుష్ప కోసం మొదటిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించిన బన్నీ.. పుష్ప 2 కోసం నడివయసు గెటప్‌తో మరో ప్రయోగం చేయనున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story