Hero Abbas: అబ్బాస్ రీ ఎంట్రీ.. త్వరలోనే ఆ హీరో సినిమాలో..

Hero Abbas: ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న నటీనటులు కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఉన్నారు. మేకర్స్ కూడా అప్పటి నటీనటులను సినిమాలో తీసుకుంటే సినిమాకు కూడా హైప్ వస్తుందని నమ్ముతున్నారు. అలా ఇప్పటికీ ఎంతోమంది ఫేడవుట్ అయిపోయిన నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అందులో అబ్బాస్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.
'ప్రేమదేశం' అనే ఓ డబ్బింగ్ సినిమాలో హ్యాండ్‌సమ్‌గా కనిపించి అప్పటి యూత్‌కు క్రష్‌గా మారిపోయాడు అబ్బాస్. ఇది ఒక డబ్బింగ్ చిత్రమే అయినా దీంతోనే తను తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినా.. ప్రేమదేశం తర్వాత మళ్లీ అంత గుర్తింపు సాధించలేకపోయాడు. అలా మెల్లగా సినిమాలకు కూడా దూరమయ్యాడు.
ప్రస్తుతం అబ్బాస్ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తాడనే వార్త వైరల్‌గా మారింది. మ్యాచో స్టార్ గోపీచంద్.. శ్రీవాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబును సంప్రదించింది మూవీ టీమ్. తనతో పాటు మరో కీలక పాత్ర ఉండగా.. అది అబ్బాస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అన్నీ వర్కవుట్ అయితే త్వరలోనే అబ్బాస్ మళ్లీ వెండితెరపై మెరవనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com