Gopichand ; రాజశేఖర్ తో గోపీచంద్ మల్టీస్టారర్... ?

Gopichand ; రాజశేఖర్ తో గోపీచంద్ మల్టీస్టారర్... ?
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది.. ఎన్టీఆర్ - రామ్ చరణ్, వెంకటేష్- వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్- రానా ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది.. ఎన్టీఆర్ - రామ్ చరణ్, వెంకటేష్- వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్- రానా ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు.. ఇప్పుడు మరో మల్టీస్టారర్ కి రంగం సిద్ధం కాబోతోంది.. సీనియర్ యాక్టర్ రాజశేఖర్- గోపీచంద్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ నుంచి మరో చిత్రం రాబోతుంది. అయితే అది మల్టీస్టారర్ చిత్రం కాబోతుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.. ఓ ప్రముఖ వ్యాపార వేత్త ఈ సినిమాని నిర్మించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.

Tags

Read MoreRead Less
Next Story