సింప్లిసిటీకి హ్యాట్సాఫ్‌.. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ తిన్న జగ్గూభాయ్‌..

సింప్లిసిటీకి హ్యాట్సాఫ్‌.. రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ తిన్న జగ్గూభాయ్‌..
ఫ్యామిలీ హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు జగపతిబాబు.. ప్రస్తుతం టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు.

ఫ్యామిలీ హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు జగపతిబాబు.. ప్రస్తుతం టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ ఇండస్ర్టీల నుంచి జగపతిబాబుకి ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. సినిమా సెలబ్రిటీ అయినప్పటికీ కామన్ మెన్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారయన.. తాజాగా తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్‌, డ్రైవర్‌తో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'చాలా రోజుల తర్వాత ఇలా హైవే పక్కన నా డ్రైవర్‌ రాజు, అసిస్టెంట్‌ చిరూతో ఫుడ్‌ని ఆరగించాను' అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story