NTR : 'నందమూరి తారకరామారావు'... ఐడీకార్డు వైరల్..!

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అక్కడ సెట్‌లోని నటీనటులకు ఐడీ కార్డులు ఇచ్చింది చిత్రబృందం.. తాజాగా ఎన్టీఆర్ తన ఐడీ కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఎన్టీఆర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటుగా నందమూరి తారక రామారావు.. హీరో అని ఉంది. అలాగే జక్కన్నతో ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోను కూడా రిలీజ్ చేశాడు తారక్. ఈ ఐడీ కార్డు అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా వేదిక పై షేర్ చేస్తూ ఖుషి అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com