Manchu Manoj meet Pawan Kalyan : పవన్‌ని కలిసిన మనోజ్.. డిస్కషన్ ఏంటి?

Manchu Manoj with Pawan Kalyan : మా ఎన్నికల వరకు చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటే.. ఎన్నికల తరువాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పోలింగ్ వరకు బద్ద శత్రువుల్లా వ్యవహరించిన మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు నేరుగా కలుసుకుంటున్నాయి. అందులో తొలిసారిగా హీరో పవన్ కల్యాణ్ ను కలిశారు మంచు మనోజ్. ముందుగా విష్ణు వచ్చి కలుస్తారేమో అని అభిమానులు భావించారు. కానీ ఈలోపే పరిణామాలు చకచకా మారిపోయాయి.
ఎన్నికల ముందు మోహన్ బాబుపై విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. అదే రీతిలో.. తనను చాలా కాలం తరువాత మెల్లగా లాగారని.. అక్టోబర్ 10న ఎన్నికలు అయిపోయిన తరువాత అన్నింటికీ సమాధానం చెబుతానని మోహన్ బాబు అన్నారు. కానీ ఎన్నికలు అయిన తరువాత ఆ విషయాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఈలోపే మంచు మనోజ్.. పవన్ కల్యాణ్ ను భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ కు వచ్చి కలవడం సంచలనం సృష్టించింది.
మా ఎన్నికలు అయిన తరువాత మంచు విష్ణు కూడా ఇండస్ట్రీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, పరుచూరి బ్రదర్స్ తో పాటు మరికొందరు పెద్దలను కలుస్తున్నారు. బాలయ్య ఇంటికి విష్ణుతోపాటు మోహన్ బాబు కూడా వెళ్లారు. అక్కడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇలాంటి తరుణంలో వీరిద్దరికీ బదులుగా పవన్ ను ముందుగా మంచు మనోజ్ కలవడం.. గంటకు పైగా మంతనాలు జరపడంతో.. దీని నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతోందా అని ఫిలింనగర్ అంతా టాక్ నడుస్తోంది.
చిత్రపరిశ్రమలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలతో పాటు తాజా సినిమాల ప్రస్తావన గురించే అని చెబుతున్నా.. ఇద్దరి మధ్యా డిస్కషన్ ఏం జరిగిందా అన్న హాట్ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ కు దారితీసింది.
It's always a pleasant yet powerful experience meeting our power star @PawanKalyan garu 🤗🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 14, 2021
Spoke heartfully. Thanks for the kind words & love u showered upon me anna🤗
Love you much :) Jai Hind 💪🏾🔥 pic.twitter.com/YoRwxYPWiu
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com