క్షణాల్లో ఓ వార్తను మరో వార్త రీప్లేస్ చేస్తుంది.. సోషల్ మీడియా వార్తలపై చైతూ..!

క్షణాల్లో ఓ వార్తను మరో వార్త రీప్లేస్ చేస్తుంది.. సోషల్ మీడియా వార్తలపై చైతూ..!
అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’.. సాయిపల్లవి హీరోయిన్‌‌గా నటించింది.

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం 'లవ్‌స్టోరీ'.. సాయిపల్లవి హీరోయిన్‌‌గా నటించింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీబిజీగా ఉన్న చైతూ.. ఓ ఛానల్‌‌‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల పైన స్పందించారు.

"బేసిక్‌‌గా ప్రతిఒక్కరికి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలనేవి ఉంటాయి. వాటిని వేరువేరుగా నా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నా. షూటింగ్, బిజినెస్‌కి సంబంధించిన విషయాలను ఇంటికి వచ్చాక మర్చిపోతుంటారు. వాటి గురించి ప్రస్తావించారు" అని చై వెల్లడించాడు.

అటు సోషల్ మీడియాలో వచ్చే వార్తల పైన ఆయన మాట్లాడుతూ.. ''గతంలో కూడా నా పైన అనేక వార్తలు వచ్చాయి. మొదట్లో వాటిని చూసి బాధపదేవాడిని.. ఇలా ఎలా రాస్తారు అని అనుకునేవాడిని... అప్పట్లో నెలకో మ్యాగజైన్‌ వచ్చేది.. మళ్ళీ ఇంకో మ్యాగజైన్‌ వచ్చేవరకు అదే వార్త వినిపిస్తుండేది. కానీ ఇప్పుడలా కాదు.. క్షణాల్లో ఓ వార్తను మరో వార్త రీప్లేస్ చేస్తుంది. ఎన్ని వార్తలు వచ్చిన వాస్తవాలు మాత్రమే ప్రజలకి గుర్తుంటాయని అర్ధమైనప్పటి నుంచి వీటి గురించి పట్టించుకోవడం మానేసాను" అని చైతూ వెల్లడించాడు.

కాగా 'లవ్‌స్టోరీ' చిత్రం రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story